fbpx
Saturday, November 9, 2024
HomeTelanganaతెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: జాబ్ క్యాలెండర్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: జాబ్ క్యాలెండర్ విడుదల

Good news-Telangana unemployed -ob calendar-released

తెలంగాణ: తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ రోజు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు.

జాబ్ క్యాలెండర్ ముఖ్యాంశాలు:

-ఉద్యోగాల సంఖ్య: ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించలేదు. కానీ నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో పోస్టుల సంఖ్యను వెల్లడిస్తామని భట్టి విక్రమార్క్ తెలిపారు.

  • వార్షిక ప్రకటన: యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. ఇది నిరుద్యోగులకు ముందుగా అవకాశాలను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది.
    -చట్టబద్ధత: మే మాసంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటించారు.
  • ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేయనున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లకు ఈ ఆర్డినెన్స్ వర్తింపజేస్తారు.

ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను నింపాయి. జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చిన ఈ అవకాశాలను ఉపయోగించుకుని, నిరుద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular