న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. ఇటీవలే కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచిన తరువాత, వారి జీతం రూ.95,000 వరకు పెరిగినట్లు పలు నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)లో ఏకంగా 28 శాతం పెంచింది. తర్వాత ఆ డీఏ నుంచి 28 శాతం నుంచి 31 శాతం వరకూ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ఉద్యోగుల బేసిక్ పే, గ్రేడ్ ప్రకారం వారి జీతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని తెలిపింది కేంద్రం. ఇప్పుడు, డీఏ పెరిగిన తరువాత వారి జీతం కూడా పెరగాల్సి ఉంటుంది. ఇక కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.