న్యూఢిల్లీ: శుభకార్యాల కోసం లేదా ఇతర అవసరాలకు మీరు బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారు? అలా అయితే, మీకు ఇది నిజంగా ఒక శుభవార్తే! దేశంలో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గుదల నమోదు చేసింది.
క్రితం శుక్రవారం రోజున 1% తగ్గుదల నమోదు తర్వాత బంగారం ధర ఒక ఔన్స్ కు దాదాపు 1,812 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఆర్ధికంగా కోలుకోవడం మొదలవడం మరియు అమెరికా దేశ డాలర్ కూడా కాస్త ఒత్తిడి నుంచి బయటపడడం వల్ల బంగారు ధర అంతర్జాతీయంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.
తాజాగా ఇప్పుడు ఆ ప్రభావం భారత దేశ బంగారం మార్కెట్ పై కూడా ప్రభావం చూపి ఇక్కడి బంగరం ధరల తగ్గుదలకు దోహదం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో అధిక స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ.48,423 నుంచి రూ.48,105కు దిగివచ్చినట్లు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది.
కాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ మార్కెట్లో మాత్రం బంగారు ధరలు స్థిరంగానే ఉన్నాయి. అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,090గా ఉండగా ఆర్నమెంట్ తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా అధికశాతంలో తగ్గింది.
ఇవాళ మార్కెట్లో ఒక కిలో వెండి ధర రూ.67,936 వద్ద కొనసాగుతోంది. కాగా బంగారం ధర తగ్గుదలపై అనేక అంశాలు ప్రభావం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, మరియు ఆ బంగారం యొక్క వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, మరియు బాండ్ ఈల్డ్ వంటి చాలా ముఖ్యమైన అంశాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.