fbpx
Thursday, January 16, 2025
HomeNationalబంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట, ధరల పతనం

బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట, ధరల పతనం

GOODNEWS-FOR-GOLD-BUYERS-WITH-HUGE-PRICE-DROP

ముంబై: బంగారం కొనాలని ఆలోచనలో ఉన్నారా? అయితే అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త. కేవలం ఒకే ఒక్కరోజులో బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధరలు భారీగా పడిపోవడంతో దాని ప్రభావం మన దేశీయ బంగారం ధరల మీద కూడా ప్రభావం చూపింది. అందువల్ల బంగారం ధర దిగి వచ్చింది.

బంగారం ధరతో పాటే వెండి కూడా పతనమైంది. భారత రాజధాని నగరం అయిన ఢిల్లీలో తులం అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒకేసారి రూ.911లు తగ్గడంతో ఇప్పుడు దీని ధర రూ.47,611కి పడిపోయింది. ఇంతకు ముందు ట్రేడింగ్‌లో ఈ ధర రూ.48,529గా ఉంది. అయితే ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.841 తగ్గడంతో తాజాగా రూ.43,612కి చేరుకుంది.

క్రితంలో ఒకే సారి ఇంత ఎత్తున బంగారం ధరలు తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. ఇది ఇలా ఉంటే, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా బంగారం‌ ధరలు దిగొచ్చాయి. జూన్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల 122 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 క్షిణించి రూ.45,350కు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో, 2023లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. దీంతో బుధవారం పుత్తడి ధర ఒక శాతం తగ్గింది. అలా 2.31 శాతం ధర పడిపోవడంతో ఔన్స్‌ పసిడి ధర 1,821 డాలర్లు పలుకుతోంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1,311లు తగ్గడంతో 70,079గా ట్రేడ్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular