న్యూఢిల్లీ: బంగారం ప్రియులకు గొప్ప శుభవార్త. గడచిన నాలుగు రోజులుగా దేశంలో బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికి కూడా దేశీయ మార్కెట్ లో మాత్రం పసిడి ధరలు పడిపోవడం ఆశ్చర్యం.
కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రకటించడంతో ఆ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దింతో ఏడు నెలల కనిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారు రేట్లు తగ్గుతూ వచ్చాయి.
ఎంసిఎక్స్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకుంది. బెంగుళూరు నగరంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.44,350గా ఉంది. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు రూ.440 క్షిణించి రూ.48,380 చేరుకోగా పది గ్రాముల 22క్యారెట్ల బంగారం 400 పతనంతో 44,350 రూపాయలకు చేరుకుంది.
దింతో పాటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు దిగొచ్చి రూ.72 వేల 200కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.