హైదరాబాద్ : ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ తీవ్ర నష్టలను చవిచూసింది. అయినా ఈ సమయంలో ప్రయాణికుల గురించి ఆలోచించి వారు పాస్ లో ఉపయోగించని రోజులను తిరిగి ఇవ్వాలని ఆలోచిస్తోంది.
ఈ లాక్‌డౌన్ కాలంలో తీసుకున్న బస్ పాస్‌లో (ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్‌పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు తిరిగి మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్‌ఆర్టీసీ కల్పించనుంది.
అందుకు వినియోగదారులు అప్పటి బస్ పాస్‌ను కౌంటర్‌లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని రవాణ శాఖ సూచించింది. కొత్త పాస్‌లో పాత పాస్ లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వాడుకోవచ్చని తెలిపింది.