న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ సాఫ్ట్వేర్ లో భారత దేశంలోని కరోనాతో భాదపడుతున్న భాదితుల కోసం తమ అప్లికేషన్‌లో ఒక కొత్త ఫీచర్‌ను పరీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశంలో భారీగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో రోగులకు అవసరమైన పడకలు, ఇంకా మెడికల్ ఆక్సిజన్ అందుబాటుకి సంబందించిన స్థానిక సమాచారాన్ని అవసరమైన వారికి తెలియజేయడం కోసం ఈ ఫీచర్ ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది.
కాగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను అరికట్టడానికి భారత ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు తమ వంతు మద్దతు ఇవ్వడానికి గూగూల్ ఈ రకంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. కోవిద్ తో బాధ పడే ప్రజలకు కీలకమైన సమాచారాలైన ఆసుపత్రిలలో పడకలు, వైద్య ఆక్సిజన్‌కు లభ్యత వెతుకుతున్న విషయం తెలుసు.
కాబట్టి వాతికి సంబంధించిన సమాధానాలను ప్రజలు తేలికగా కనుగొనడంలో వారికి సహాయపడటానికి, మ్యాప్‌లలోని ప్రశ్నలు & సమాధానాలు అనే ఫంక్షన్‌ను ఉపయోగించి కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాము. ప్రజలు వారి స్థానిక ప్రదేశాలలోని పడకలు, మెడికల్ ఆక్సిజన్ అందుబాటుకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది” అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.