fbpx
Sunday, January 19, 2025
HomeInternationalపిక్సెల్ 5జీ ఫోన్లను లాంచ్ చేసిన గూగుల్

పిక్సెల్ 5జీ ఫోన్లను లాంచ్ చేసిన గూగుల్

GOOGLE-LAUNCH-PIXEL-5G-SMARTPHONES

ముంబై: కొత్త 5 జీ స్మార్ట్‌ఫోన్లను గూగుల్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. లగ్జరీ మొబైల్ ఫోన్ల విభాగంలో పిక్సల్ 5, పిక్సల్ 4ఏ (5జీ) లను లాంచ్ చేసింది. అక్టోబర్ 15 న జపాన్‌లో మొదట లాంచ్ అవుతుంది. తరువాత ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, తైవాన్, బ్రిటన్, అమెరికా మొత్తం 9 దేశాలలో (అక్టోబర్ 15) అందుబాటులో ఉండనుంది. నవంబర్ నుండి ఇతర దేశాలలో లభ్యం కానుంది.

గూగుల్ పిక్సెల్ 5 5 జీ ఫీచర్లు:
6.00-అంగుళాల స్క్రీన్, 1080క్ష్2340 పిక్సెల్స్ రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తో అందుబాటులోకి వస్తుంది. గూగుల్ పిక్సెల్ 5 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 51,400

గూగుల్ పిక్సెల్ 4 ఏ 5 జీ ఫీచర్లు:
6.20 అంగుళాలు స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11, 1080క్ష్2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీకెమెరా, 12 +16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 3885 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం. గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ ప్రారంభ ధర సుమారు రూ. 37,000.

2021 లో గూగుల్ టీవీలాను కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. సోనీ , ఇతర ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ భాగస్వామ్యంతో స్మార్ట్ టీవీలను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular