fbpx
Wednesday, January 15, 2025
HomeInternationalగూగుల్ మ్యాప్స్ స‌రికొత్త అప్‌డేట్‌

గూగుల్ మ్యాప్స్ స‌రికొత్త అప్‌డేట్‌

GOOGLE-MAPS-RIDE-SERVICES

న్యూఢిల్లీ: మన ప్రయాణంలో కొత్త ప్రదేశానికి వెళ్ళలన్నా, అక్కడ ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నా ఠక్కున గుర్తు వచ్చేది గూగుల్ మ్యాప్స్. ఆ గూగుల్ మ్యాప్స్ స‌రికొత్త అప్‌డేట్‌ను తీసుకు రానుంది. తాజా బీటా రిపోర్ట్ ప్రకారం, గూగుల్ మ్యాప్స్ లో ‘రైడ్ సర్వీసెస్’ అనే కొత్త సర్వీస్ ని తీసుకోరాబోతుంది.

గూగుల్ మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవ‌డానికి ఇది చాలా సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ‘రైడ్ సర్వీసెస్’ సెట్టింగ్‌ అనేది ఉబెర్ కంపెనీ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు అనేవి వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉండవచ్చని సమాచారం.

అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు మరియు క్రాస్‌వాక్ గుర్తులను జోడించినట్లు నివేదిక పేర్కొంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్నీ నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.

న్యూయార్క్ వంటి నగరాల్లోని వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా మీరు భవనాల సంఖ్యలను మరియు క్రాస్‌వాక్ గుర్తులను కూడా గుర్తించవచ్చని నివేదికలోని స్క్రీన్‌షాట్‌లలో తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular