న్యూ ఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 4 ఎ కొత్త ఫోన్ వచ్చే వారం ఆగస్టు 3 న లాంచ్ చేయబోతోంది. పిక్సెల్ 4 ఎ మే నెలలో గూగుల్ ఐ / ఓలో లాంచ్ అవుతుందని భావించారు, ఆ తరువాత కోవిడ్ -19 సంక్షోభం కారణంగా రద్దు చేయబడింది.
గూగుల్ వెబ్‌సైట్‌లో కొత్త ఫోన్ రాకపై ఆశలను తిరిగి తెచ్చింది. గత లీక్‌లు పిక్సెల్ 4 ఎలో హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి మరియు మోషన్ సెన్సార్ నియంత్రణల కోసం సోలి చిప్‌ను వాడుతున్నట్టు సమాచారం.
గూగుల్ పిక్సెల్ 4ఎ ఆన్ లైన్ స్టోర్స్ లో లాంచ్ గురించి లీక్ ఇచ్చింది. అయితే ఈ లీక్ లో ఫొన్ కి సంబంధించిన ఫీచర్స్ గురించి ప్రస్తావించలేదు. కానీ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, లోలైటెనా, మాక్రో, వీడియోచాట్స్, బొకేమోడ్ కెమెరా లాంటి పదాల గురించి మాత్రం లీకులు వదిలింది.
గూగుల్ ట్విట్టర్ హాండిల్ లొ కొత్త గూగుల్ ఫోన్ ప్రవేశపెడుతున్నాం అని ప్రకటించరు. ఫోన్ పై భాగంలో ఎడమ వైపు హోల్-పంచ్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. అయితే అఫీషియల్ గా ఇది గూగుల్ 4ఎ మోడల్ అని ప్రకటించలేదు. అఫీషియల్ అప్ డేట్ కోసం వేచి చూడాలి.
GOOGLE PIXEL 4A LAUNCH | GOOGLE PIXEL 4A LAUNCH