fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsగోపీచంద్ – UV క్రియేషన్స్ సపోర్ట్ తో కొత్త ప్రాజెక్ట్

గోపీచంద్ – UV క్రియేషన్స్ సపోర్ట్ తో కొత్త ప్రాజెక్ట్

GOPICHAND-NEW-PROECT-WITH-UV-CREATIONS
GOPICHAND-NEW-PROECT-WITH-UV-CREATIONS

మూవీడెస్క్:టాలీవుడ్ లో గోపీచంద్ గత కొన్నేళ్లుగా విజయాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనకు పెద్దగా కమర్షియల్ హిట్స్ అందడం లేదు.

2014లో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో ఆయన మార్కెట్ తగ్గిపోతోంది.

అయితే, తాజాగా గోపీచంద్ కు UV క్రియేషన్స్ సంస్థలో మరో అవకాశం లభించినట్లు సమాచారం. ప్రభాస్ సన్నిహితులు నిర్వహిస్తున్న UV క్రియేషన్స్ లో ఇప్పటికే గోపీచంద్ తో జిల్, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు వచ్చాయి.

ఈ రెండూ ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా, UV క్రియేషన్స్ ఇప్పుడు మళ్లీ గోపీచంద్ తో రాధాకృష్ణ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను నిర్మించడానికి సిద్దమవుతోంది.

రాధాకృష్ణ గతంలో ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేశాడు, ఆ సినిమా కూడా పెద్దగా విజయవంతం కాలేదు. అయినప్పటికీ, ప్రభాస్ అతని పని తీరును మెచ్చుకుని, ఈ కొత్త ప్రాజెక్ట్ కు పుష్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు గోపీచంద్ మరియు రాధాకృష్ణ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular