టాలీవుడ్: హీరో గా కెరీర్ ప్రారంభించి విలన్ గ గుర్తింపు తెచ్చుకుని మళ్ళీ హీరోగా హిట్లు సాధించి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న నటుడు గోపీచంద్. గత కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నా కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ప్రస్తుతం గోపి చంద్, దర్శకుడు మారుతీ తో ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. రేపు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ విడుదల చేసింది సినిమా టీం. ఈ పోస్టర్ లో ఒక మంచి స్టైలిష్ లుక్ లో గోపి చంద్ కనిపిస్తున్నాడు.
గోపి చంద్ ఇప్పటి వరకు ‘జిల్’ సినిమాలో పూర్తి స్టైలిష్ లుక్ లో కనిపించాడు. మళ్ళీ ఈ సినిమా ద్వారా అలాంటి ఒక లుక్ ని రిపీట్ చేయనున్నాడని అర్ధం అవుతుంది. విశేషం ఏంటి అంటే ఈ రెండు సినిమాలు యూవీ క్రియేషన్ వారే నిర్మిస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో గోపి చంద్ కి జోడీ గా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమాలో కూ రాశి ఖన్నా ఒక చలాకి పాత్రలో నటించనుంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్ తో పాటు అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై బన్నీ వాసు కూడా నిర్మిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. కరోనా వాళ్ళ షూటింగ్ బ్రేక్ పడిన ఈ సినిమా మిగిలిన భాగం షూట్ పూర్తి చేసుకుని త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.