మూవీడెస్క్: టాలీవుడ్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గోపీచంద్ తో చేసిన గోలీమార్ చిత్రం మంచి హిట్ అందుకోవడంతో, ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2010లో వచ్చిన గోలీమార్, గోపీచంద్ కెరీర్‌లో మంచి హిట్ గా నిలిచింది. గతంలో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తీసిన పూరీ, ఆ చిత్రం భారీ ఫలితం అందుకోకపోవడంతో నిరాశ చెందారు.
అలాగే రామ్‌తో చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ, పూరీ మళ్ళీ ట్రాక్ లోకి తిరిగి రావాలని ఇప్పుడు చూస్తున్నారు.
ఇదే క్రమంలో, గోపీచంద్ కోసం ఒక కొత్త కథను రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం చిత్రంలో నటిస్తున్నారు.
ఆ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి, గోపీచంద్ – పూరీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
అలాగే పూరి లిస్టులో మరొక మాస్ హీరో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.