టాలీవుడ్: హీరో నుండి విలన్ మళ్ళీ విలన్ నుండి హీరో గా కష్టపడి ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్న హీరో ‘గోపీచంద్‘. యాక్టింగ్, ఫైట్స్ బాగున్నా కంటెంట్ ఉన్న సినిమాలు తీసినా కూడా ఎందుకో గోపిచంద్ కి సరైన సక్సెస్ రావట్లేదు. మధ్య మధ్యలో హిట్స్ వస్తున్నాయి తప్ప వరుసగా హిట్లు సాధించడం లో తడబడుతున్నాడు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతీ దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీ మార్’ అనే సినిమాని దాదాపు పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేశారు. ఈ సినిమాలో మొదటి సారి స్పోర్ట్స్ కోచ్ గా కనిపించనున్నాడు గోపి చంద్.
వీటితో పాటు తనతో ఇదివరకు రెండు సినిమాలు రూపొందించి రెండు సక్సెస్ లు అందించిన శ్రీవాస్ తో సినిమా ప్రకటించాడు గోపి చంద్. రెండు మంచి సక్సెస్ ల తర్వాత హాట్ట్రిక్ కాంబో గా వీళ్ళ సినిమా రానుంది. శ్రీ వాస్ చివరగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘సాక్ష్యం’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమా రూపొందించాడు. లక్ష్యం, లౌక్యం లాంటి ఫామిలీ ఎంటర్టైనర్ ల తర్వాత ఈ సారి ఎలాంటి సబ్జెక్టు తో రానున్నాడో చూడాలి. గోపి చంద్ 30 వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో కలకత్తా కి సంబందించిన విజువల్స్ చూడచ్చు. ఈ సినిమాని కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందించనున్నట్టు అర్ధం అవుతుంది.