వరంగల్ : తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడు అయిన సంజయ్ కుమార్ యాదవ్‌కు వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు ఈ రోజు శిక్షను ఖరారు చేస్తూ తమ తుది తీర్పు ఇచ్చింది.
తొమ్మిది మంది హత్య కేసు విచారణ ఇన్నాళ్ళు జరిగింది. ఈ కేసులోని నిందితుడు అయిన సంజయ్ కుమార్ యాదవ్ కి ఉరిశిక్ష విధిస్తూ బుధవారం అదనపు సెషన్స్ కోర్టు తమ తుది తీర్పును వెలువరించింది.
మే 21న సంజయ్ కుమార్ యాదవ్ తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి హత్య చేసాడు. హత్య అనంతరం వారి మృతదేహాలను దగ్గర్లోని బావిలో పడేశాడు. తను ఒక హత్యను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వరుసగా తొమ్మిది మందిని దారుణంగా హత్య చేశాడు. కోర్డు ఇచ్చిన ఉరి శిక్ష తీర్పుపై సర్వతా హర్షం వ్యక్తం అవుతోంది. నిందితుడికి త్వరగా శిక్ష విధించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.