fbpx
Friday, January 31, 2025
HomeTelanganaతెలంగాణలో త్వరలో ప్రభుత్వ కొలువుల జాతర

తెలంగాణలో త్వరలో ప్రభుత్వ కొలువుల జాతర

GOVERNMENT-JOBS-NOTIFICATION-IN-TELANGANA

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రభుత్వ కొలువుల జాతర మొదలవబోతుంది. పోలీస్‌ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా సమాచారం. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మిగతా పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఈ శుభవార్త తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్‌ జరగాల్సి ఉంది.

ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇంకా ఇతర శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు కూడా వెంటనే సేకరించాలని ఆదేశించారు. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో పూర్తి లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ సమావేశంలో ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular