fbpx
Sunday, September 8, 2024
HomeBig Story58 ఏళ్ల నిషేధం ఎత్తివేత: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

58 ఏళ్ల నిషేధం ఎత్తివేత: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి

Government-liftsban-employees-rss activities

న్యూఢిల్లీ: 58 ఏళ్ల నిషేధం ఎత్తివేత, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ సంచలన నిర్ణయం భారత రాజకీయ రంగంలో కొత్త చర్చలకు తావిచ్చింది.

గత వారంలో జారీ చేసిన ఉత్తర్వుల కాపీని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటి విభాగం అధిపతి అమిత్ మాల్వియా ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 58 సంవత్సరాల క్రితం జారీ చేసిన రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రతిస్పందన
కాంగ్రెస్ ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది. హస్తం పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ సుదీర్ఘ పోస్టు ద్వారా స్పందించారు.

ఆయన మహాత్మా గాంధీ హత్య తర్వాత 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించిన నిషేధాన్ని, ఆపై 1966లో మళ్లీ అమల్లోకి వచ్చిన నిషేధాన్ని గుర్తుచేశారు. “తాజా చర్య పలు అనుమానాలకు తావిస్తోంది” అని విమర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్-భాజపా సంబంధాలపై సందేహాలు
ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్-భాజపా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తలు వచ్చిన తరుణంలో ఈ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని జైరాం రమేశ్ ప్రశ్నించారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆశించిన స్థాయి విజయం సాధించలేక, 240 సీట్లకే పరిమితమైంది.

ఆ ఫలితాల అనంతరం ఆరెస్సెస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపా కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని, వారితోపాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకొని పని చేశారని, మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలు వినలేదని ఆ వ్యాసం పేర్కొంది.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు కూడా ఈ ఆర్‌ఎస్‌ఎస్-భాజపా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తలను ప్రతిబింబించాయి.

“నిజమైన సేవకుడు అహంకారం కలిగిఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు” అని ఆయన అన్నారు.

ఈ నిర్ణయం పట్ల వివిధ రాజకీయ పక్షాలు, సామాజిక సంఘాలు, మరియు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular