జాతీయం: మహిళల వ్యాపార ప్రణాళికలకు ప్రభుత్వ మద్దతు
ఇప్పటి మహిళలు ఇంటి పనులు, ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా ఎదుగుతున్నారు.
కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలని ఆశపడే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఈ ప్రోత్సాహం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మహిళల బిజినెస్ దిశగా అడుగులు
ఇప్పటి మహిళలు కుటుంబ నిర్వహణతో పాటు స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నారు.
అందుకు వారు ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, వ్యాపార ఆలోచనలతో ముందుకువస్తున్నారు.
ఈ క్రమంలో దేశంలో నూతన యునికార్న్‌లకు మహిళలు కూడా ప్రధాన భాగస్వామ్యంగా మారుతున్నారు.
వ్యాపార ప్రణాళిక ఉన్న మహిళలకి నిధులు పెద్ద అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో, ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అందిస్తోంది.
స్టార్టప్‌లకు నిధుల కేటాయింపు
భారత ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తెచ్చి స్టార్టప్‌లకు సహాయం అందిస్తోంది.
ఆర్థిక సలహాదారు ఆర్తీ భట్నాగర్ ప్రకారం, మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లు రూ. 5 కోట్ల వరకు నిధులు పొందగలవు.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం కింద ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 5 కోట్ల సాయం అందజేస్తున్నారు.
ఈ పథకం కేవలం నిధులకే పరిమితం కాకుండా, మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన వనరులు, సౌకర్యాలు కూడా అందించడం లక్ష్యం.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (SISF)
భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని భట్నాగర్ అన్నారు.
SISF పథకానికి రూ. 945 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం కొత్తగా వ్యాపారాల ప్రోటోటైప్ అభివృద్ధి, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెట్ ఎంట్రీ, వాణిజ్యీకరణకు మద్దతు అందిస్తుంది.
తద్వారా, ప్రాథమిక దశలో ఉన్న స్టార్టప్‌లు పెద్ద కంపెనీలతో పోటీ పడగలవు.
వెంచర్ క్యాపిటల్ మద్దతు
ఇంకా, స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వీటి ద్వారా అధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న స్టార్టప్‌లు పెట్టుబడులు పొందవచ్చు.
VC ఫండ్లు సాధారణంగా ప్రత్యేక పెట్టుబడిదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి భారీ మార్కెట్ టార్గెట్ కలిగిన సంస్థల కోసం చూస్తాయి.
మరింత సమాచారం
ప్రభుత్వ నిధుల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే, seedfund.startupindia.gov.inను సందర్శించవచ్చు.