టాలీవుడ్: దేశం మొత్తం ఆసక్తి గా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ‘RRR ‘. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రావడం, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటులుండడం, ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఈ సినిమా పై ఆసక్తి ని రెట్టింపు చేస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో కూడా ఈ సినిమా హవా ఎక్కడ తగ్గకుండా నడుస్తుంది.
ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబందించిన ప్రకటన ఒకటి జరిగింది. అది చూసిన తర్వాత ఒక ఇండియన్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ ఇదే మొదటిసారి అని అనిపిస్తుంది. బాలీవుడ్ సినిమాకి కూడా ఇలా బిజినెస్ అయ్యి ఉండదు అంటే ఆశర్యం లేదు. బిజినెస్ ఫిగర్స్ చూపించనప్పటికీ రైట్స్ అమ్మిన భాషలు, స్ట్రీమింగ్ పార్టనర్స్ చూస్తే కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని హిందీ లో నెట్ ఫ్లిక్స్, మిగతా సౌత్ భాషల్లో zee5 చేజిక్కించుకున్నారు. సాటిలైట్ హక్కులని హిందీ లో జీ సినిమా, తెలుగు తమిళ్ కన్నడ లో స్టార్ నెట్వర్క్, మలయాళం లో ఏషియా నెట్ చేజిక్కించుకున్నాయి. మొదటి సారి ఒక రీజనల్ సినిమా రిలీజ్ కన్నా ముందే ఫారెన్ రైట్స్ కొనుగోలు అవడం ఇదే మొదటిసారి అయ్యి ఉండచ్చు. ఈ సినిమాకి సంబందించిన ఫారెన్ లాంగ్వేజ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ పొందింది. ఈ సినిమాని ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్ భాషల్లో స్ట్రీమ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది. బహుశా ఇన్ని భాషల్లో రైట్స్ అమ్ముకోవడం, అది ప్రకటన చేయడం కూడా RRR రికార్డు అవుతుందేమో.