భీమవరం: కీలక కాపు నాయకుడు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించి గ్రంధి శ్రీనివాస్ వైసీపీ గౌరవాన్ని నిలబెట్టినప్పటికీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారు.
వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గ్రంధి ఆచితూచి ఉండిపోయారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
గ్రంధి పార్టీ మారకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గడచిన కాలంలో నాయకుల బుజ్జగింపు అవసరం లేదని చెప్పే వైసీపీ ఇప్పుడు గ్రంధిని రీచ్ అవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. గతంలో నాని రాజీనామా చేసినప్పుడు పెద్దగా స్పందించని వైసీపీ ఇప్పుడు ఎలాంటి వ్యూహం అవలంబిస్తుందో చూడాలి.