ముంబై: ఐపీఎల్ 2022లో అధ్బుతం జరిగింది. ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా తొలి సారి బరిలోకి దిగినప్పటికీ చాంపియన్స్‌గా అవతరించింది గుజరాత్ టైటాన్స్. రాజస్థాన్ రాయల్స్ విసిరిన 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
గుజరాత్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్ 45, డేవిడ్ మిల్లర్ 32 ఇద్దరూ నాటౌట్ గా నిలిచి గుజరాత్‌ను గెలిపించారు. అంతకముందు హార్దిక్ పాండ్యా 34 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి అవుటయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ తలా ఒక వికెట్ తీశారు.
ఇక ఐపీఎల్ అరంగేట్రం సీజన్‌తోనే టైటిల్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ కొత్త చరిత్ర సృష్టించింది. 2008 తర్వాత మరోసారి కప్ గెలవాలన్న రాజస్తాన్ రాయల్స్ కోరిక నెరవేరలేదు.