స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తన విజయంలో మహేంద్ర సింగ్ ధోనీ ప్రభావం ఉందని చెప్పాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోనీ చివర్లో కొట్టిన సిక్సర్‌ను చూసినప్పటి నుంచి, ఒత్తిడిలో ఎలా కూల్‌గా ఉండాలో తనకు తెలిసిందని గుకేశ్ అన్నారు.
“ధోనీ లాగా నేర్చుకోవాలి అనుకున్నా. ఆయనను చూస్తే ఒత్తిడిని ఎదుర్కొనడం సులభమవుతుంది,” అని పేర్కొన్నాడు.
ధోనీ మ్యాచ్‌ను ఎలాగైతే ప్రశాంతంగా ముగిస్తాడో, తన ఆటలోనూ అదే తత్వాన్ని అలవర్చుకున్నానని గుకేశ్ తెలిపారు. 2011 ఫైనల్ సిక్సర్‌ను ఇప్పటికీ మరిచిపోలేనని, అది తనకు ప్రతి సమయంలో స్పూర్తి ఇస్తుందని పేర్కొన్నారు.
“ఆ ఒక్క షాట్ ఒక తీపి గుర్తుగా నా మనసులో ఉంటుంది,” అని అన్నారు. గతేడాది డంగ్ లీరెన్‌పై గెలిచి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 17 ఏళ్ల వయసులోనే ఈ అద్భుతం సాధించడం గుకేశ్‌ని అంతర్జాతీయంగా నిలబెట్టింది.
ఇలాంటి మైలురాళ్లకు వెనుక ఉన్న ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ధోనీ వల్లే వచ్చిందని గుకేశ్ అన్నారు. స్పోర్ట్స్‌లో మానసిక స్థిరత్వం ఎంత ముఖ్యమో ఆయన మాటలు మళ్లీ రుజువు చేస్తున్నాయి.