మూవీడెస్క్: దర్శకుడు హను రాఘవపూడి “సీతారామం” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు, అతను ప్రభాస్‌తో కలిసి ఒక భారీ పాన్-ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
దాదాపు 350 కోట్ల వ్యయంతో రూపొందబోతున్న ఈ చిత్రానికి “ఫౌజీ” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. బ్రిటిష్ కాలంలో 1940ల నేపథ్యంతో సాగే ఈ సినిమా, యుద్ధం నేపథ్యంలో ఉంటుందట.
విజువల్స్, యాక్షన్ సీన్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం హను రాఘవపూడి లొకేషన్ రెక్కీలో బిజీగా ఉన్నాడు.
వేట మొదలైనట్లు తెలుస్తోంది. టెక్నికల్ ఎలిమెంట్స్‌ను ఖచ్చితంగా ఎంచుకోవడానికి దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు.
సినిమాటోగ్రఫర్ సుదీప్ చట్టర్జీతో కలిసి హను లొకేషన్స్ వేట స్టార్ట్ చేసినట్లు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు. ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ అనేలా గ్రాండ్‌గా రూపొందించడానికి కష్టపడుతున్నారు.
ఇమాన్వి ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోంది, అలాగే మరో కీలక పాత్రలో పాకిస్థాన్ నటి కూడా ఉంటుందని టాక్.
ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది, 2026లో ప్రేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.