టాలీవుడ్: మెగా స్టార్ చిరంజీవి మలయాళం లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. సాహో డైరెక్టర్ సుజీత్ పేరు ముందుగా వినిపించింది ఆ తర్వాత వీవీ వినాయక్ పేరు వినిపించింది. అయితే ఇపుడు కొత్తగా మరో డైరెక్టర్ తో అధికారికంగా ప్రకటించాడు చిరంజీవి. ఇప్పటివరకు ఫ్రేమ్ లో లేని ఈ పేరు విని ఫాన్స్ షాక్ అయ్యారు. ఈ సినిమా తెలుగులో డబ్ అయినా కూడా మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో చేస్తున్న ‘ఆచార్య’ తర్వాత 153 వ సినిమా గా లూసిఫర్ రీమేక్ రానుంది.
అప్పట్లో జగపతి బాబు, అర్జున్ హీరోలుగా నటించి సూపర్ హిట్ అయిన ‘హనుమాన్ జంక్షన్’ సినిమాకి దర్శకత్వం వహించిన ‘మోహన్ రాజా‘ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాడు అది కూడా మెగాస్టార్ చిరంజీవితో. మోహన్ రాజా కి రీమేక్ స్పెషలిస్ట్ అని పేరు కూడా ఉంది. తెలుగు లో సూపర్ హిట్ అయినా చాలా సినిమాల్ని తమిళ్ లో రీమేక్ చేసాడు ఈ డైరెక్టర్. తెలుగులో సూపర్ హిట్ అయిన జయం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాల్ని రీమేక్ చేసాడు. చివరగా రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమా తమిళ్ మాతృకకి కథని కూడా అందించాడు. ఇన్ని రోజుల తర్వాత చిరంజీవి ని దర్శకత్వం వహించబోతున్నందుకు ఆనందం కూడా వ్యక్తం చేసాడు. 2021 సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు.