fbpx
Wednesday, April 9, 2025
HomeMovie Newsభజ్జీ సెకండ్ ఇన్నింగ్స్

భజ్జీ సెకండ్ ఇన్నింగ్స్

Harbajan Singh Second Innings

చెన్నై: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు క్రియేట్ చేసుకున్న భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్. అద్భుతమైన స్పిన్ మాయా జాలం తో భారత జట్టుకు చాలా విజయాలు అందించాడు అలాగే చాలా రికార్డు లు కూడా తన పేరు పైన లిఖించుకున్నాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత భజ్జీ సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ఇండస్ట్రీలో మొదలు పెట్టాడు. ప్రస్తుతం హర్భజన్ సింగ్ హీరో గా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా నిర్మాణం లో ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. కాగా హర్భజన్ సింగ్ బర్త్ డే సందర్భంగా ‘ఫ్రెండ్ షిప్’ మూవీలోని ఫస్ట్ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది ఈ సినిమా టీం.

ఈ సినిమాలో హర్భజన్ సింగ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ గా నటిస్తున్నారు. ‘సూపర్ స్టార్ ఆంథమ్’ పేరుతో ఫస్ట్ సింగిల్ ను దర్శకుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘నా దేహమంతా సూపర్ స్టార్.. నా ప్రాణమంతా సూపర్ స్టార్..” అంటూ సాగే ఈ తెలుగు పాటని తెలుగులో హేమచంద్ర ఆలపించారు. లిరిక్ రైటర్ రాజశ్రీ సుధాకర్ సాహిత్యాన్ని అందించారు. ఇక డి.ఎమ్. ఉదయ్ కుమార్ మ్యూజిక్ అందించిన ఈ పాటను తమిళంలో హీరో శింబు పాడటం విశేషం. ఈ సినిమాలో తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమిళ నటుడు సతీష్ కూడా కనిపించనున్నారు. సీన్ టొవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జేపీఆర్ అండ్ స్టాలిన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు ఈ సినిమా టీం.

Superstar Anthem - Lyrical | Friendship Telugu Movie | Harbhajan Singh, Arjun, Losliya, Sathish

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular