ముంబై: క్రికెట్ ఆడడానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్లేయర్ కే కెప్టెన్సీ ఇవ్వాలన్నది తాము నిర్ణయించినట్లు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. కాగా, హార్దిక్ పాండ్యా టీంలో కీలక ప్లేయర్ అని, కానీ అతని ఫిట్నెస్స్ సమస్య చాలెంజింగ్ గా మారిందని ఆయన అన్నారు.
దీని వల్ల సూర్య కూమార్ యాదవ్ ను టీ20 టీం కి కెప్టెన్ గా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు.
అలాగే, సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్ గా అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, తను జట్టును ముందుండి నడిపిస్తాడని అజిత్ అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, భారత్ జట్టు శ్రీలంక పర్యటన ఈ నెల 27వ తేదీన మొదటీ టీ20తో పల్లకెలి లో మొదలవనుంది.
ఈ టీ20 సిరీస్ లో భారత్ శ్రీలంక తో 3 T20 మ్యాచ్ లు ఆడనుంది. తదుపరి 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.
అయితే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్ లో ఆడనున్నాడని ఇంతకు ముందే ప్రకటించారు.