స్పోర్ట్స్ డెస్క్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో వార్తల్లోకి ఎంటరయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తన ఆటతో కాకుండా, తన చేతి గడియారంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
హార్దిక్ చేతికి కనిపించిన ఆ వాచ్, రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన అరుదైన మోడల్. దీని ధర అక్షరాలా ₹6.92 కోట్లు అని తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది ఈ వాచ్ కలిగి ఉన్నారు.
ఈ వాచ్‌ను టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇది కార్బన్ టీపీటీ యూనిబాడీ బేస్‌ప్లేట్‌తో రూపొందించబడింది, ఇది మన్నికలో ప్రత్యేకతను కలిగిస్తుంది.
మొత్తం 50 వాచ్‌లను మాత్రమే ఉత్పత్తి చేశారు. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే గడియారాన్ని కలిగి ఉన్నారని చెబుతున్నారు.