ముంబై: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి, ప్రోత్సహించే తీరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బుమ్రా, హార్దిక్, కృనాల్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి స్టార్లు ముంబై ద్వారా వెలుగులోకి వచ్చారు. అయితే హార్దిక్, కృనాల్ కష్టాల కథ మరింత విభిన్నమని ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ తెలిపారు.
తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో, హార్దిక్, కృనాల్ మూడేళ్లపాటు కేవలం మ్యాగీ తిని బతికారని ఆమె వెల్లడించారు. రంజీ మ్యాచ్‌లలో వారి ఆటను గమనించి, ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నామని తెలిపారు.
ఆ సమయంలో వీరిద్దరూ అత్యంత కష్టాల్లో ఉన్నా, వారి పట్టుదల, క్రీడాపై ఉన్న ప్రేమ మనసును తాకిందని చెప్పారు. 2015 ఐపీఎల్ వేలంలో రూ.10 లక్షలకే హార్దిక్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్, ఆ తర్వాత అతనిలోని అసలు టాలెంట్‌ను వెలికితీసింది.
అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగి, భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పుడు అదే హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం గర్వించదగ్గ విషయమని నీతా అంబానీ పేర్కొన్నారు.
కేవలం ప్రతిభ మాత్రమే కాదు, సరైన అవకాశాలు లభిస్తే ఎలా ఎదగొచ్చో హార్దిక్, కృనాల్ పాండ్యా సోదరులు మరోసారి రుజువు చేశారు.
ముంబై ఇండియన్స్ అందించిన అవకాశాన్ని వినియోగించుకుని, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం హార్దిక్ ముంబైకి కెప్టెన్‌గా మారడం ఐపీఎల్ చరిత్రలో ఓ విశేషంగా నిలిచింది.