పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో వాయిదాలు పడుతూ చివరకు ఇప్పుడు విడుదల దశలోకి వచ్చింది.
ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా బిజినెస్ ఫిగర్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 140 కోట్ల బిజినెస్ జరగినట్టు టాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 100 కోట్ల దాకా బిజినెస్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇది పవన్ మార్కెట్‌ను బట్టి చూసిన భారీ డీల్ అని చెప్పాలి.
అయితే ఇక్కడ అసలు ప్రశ్న మరోటి ఉంది. ఇంత ఆలస్యం అయిన సినిమా వాస్తవానికి ఈ రేంజ్ టార్గెట్‌ను చేరుకుంటుందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడంలేదు.
ప్రస్తుతం హరిహర వీరమల్లు కు ముందుగా బిజినెస్ గాల్లో ఉన్నప్పటికీ, ఫైనల్ వసూళ్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినిమా విడుదల తర్వాతే తేలనుంది. మొత్తానికి ఈ చిత్రానికి ఫస్ట్ ఛాలెంజ్ మార్కెట్ వసూళ్లే అని చెప్పాలి.