పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి భాగమైన Sword vs Spirit ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, మేకర్స్ మాత్రం రెండో భాగం షూటింగ్ పూర్తి చేశారు.
ముంబైలో ఇటీవల జరిగిన అవుట్‌డోర్ షెడ్యూల్‌లో భాగంగా, పార్ట్ 2కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ల సోషల్ మీడియా పోస్టులు ఈ విషయాన్ని బయటపెట్టాయి.
ఇందుతో ఫ్యాన్స్ పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ 1ను పూర్తిగా ఫినిష్ చేసి విడుదల చేయకముందే, పార్ట్ 2 పనులు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా వాయిదాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్ట్‌కి ఒక్క విడుదల తేదీ కూడా ఇంకా నిర్దేశించలేదు.
ఇకపోతే పవన్ డబ్బింగ్ పూర్తయిందని, గ్రాఫిక్స్ వర్క్ చివరి దశలో ఉందని టాక్. మేకర్స్ మాత్రం అధికారిక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఈ గందరగోళం కొనసాగుతోంది. సమ్మర్‌లోనైనా పార్ట్ 1 వస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.