మూవీడెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మార్చి 28న విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ జట్టుపడి పనులు వేగవంతం చేస్తున్నారు.
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వర్క్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వీఎఫెక్స్ టీమ్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
తాజాగా, పవన్ కళ్యాణ్ నెలల విరామం తర్వాత యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ పునఃప్రారంభించారు.
ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, అనసూయ భరద్వాజ్ ఒక ప్రత్యేక పాటలో మెరవనుంది.
గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారని, కీరవాణి కంపోజ్ చేసిన ఈ మాస్ నంబర్ మూవీ హైలైట్ అవుతుందని అంటున్నారు.
రంగస్థలం, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలతో తన నటనను చాటుకున్న అనసూయకు పవన్ సినిమాతో మరో మెమరబుల్ ఛాన్స్ దక్కింది.
ఈ వార్తపై అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో అనసూయ ఒక రియాలిటీ షోలో దీని గురించి చెప్పిన క్లిప్ వైరల్ అవుతోంది.
హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, బాబీ డియోల్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని మరింత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి, మూవీపై హైప్‌ను పెంచాలని చిత్రబృందం కసరత్తు చేస్తోంది.