టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, హరీష్ తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు.
పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న హరీష్.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లోకి వెళ్లింది. ఇదే సమయంలో హరీష్ యంగ్ హీరో రామ్ పోతినేనితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్‌కి స్టోరీ నరేట్ చేసారని, రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
ఈ ప్రాజెక్టును కృష్ణ కొమ్మలపాటి శ్రీ అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించనున్నారని, సమ్మర్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తి దశలో ఉందట.
ఇక రామ్ ప్రస్తుతం మహేశ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది.