హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు వాగ్దానాలే తప్ప, అమలు తక్కువగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
రైతుబంధు, బతుకమ్మ చీరలు, కిట్లు వంటి పథకాలు కాంగ్రెస్ హయాంలో నిలిపివేయబడ్డాయని, మహిళలు, రైతులు, పేద గర్భిణీలు మోసపోయారని ఆరోపించారు.
ముఖ్యంగా ఆగస్ట్‌లోనే వేయాల్సిన చేప పిల్లలను ఇప్పటికీ వేయలేదని, కేవలం రూ.16 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం బాధాకరమన్నారు.
కేసీఆర్ కంటే మంచి పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు మాట తప్పారని, ముఖ్య నేతల కోసం ఓఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్చినట్లు హరీష్ ఆరోపించారు.
దక్షిణ భాగాన్ని రాష్ట్రం కాకుండా కేంద్రం నిర్మించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని హరీష్ రావు మండిపడ్డారు.