మెదక్: మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
అడిగిన వారికి బెదిరింపులు, అన్ని వర్గాలకు అన్యాయం చేయడమే రేవంత్ పాలన అని విమర్శించారు. క్రిస్మస్ వేడుకలు, కానుకలను కూడా ప్రభుత్వం నిర్వహించలేదని ఆరోపించారు.
క్రైమ్ రేటు 41 శాతం పెరిగిందని, ఏడాదిలో తొమ్మిది మతకల్లోలాలు జరిగాయని ఆరోపించారు. రైతు బంధు నిలిపివేశారని, రైతులకు కౌలు పథకాలు అందజేయలేకపోయారని ధ్వజమెత్తారు.
రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రైతులు దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్న దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త పథకాలు ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని, పాత పథకాలకే కోతలు విధించారని హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
harish rao, revanth reddy, telangana politics, farmers welfare, congress failures,