మూవీడెస్క్: సినిమా ప్రపంచంలో హీరో – హీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి వచ్చే విమర్శలు కొత్తకాదు. తాజాగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, 25 ఏళ్ల భాగ్య శ్రీ మధ్య రొమాంటిక్ సాంగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.
56 ఏళ్ల హీరో, 25 ఏళ్ల హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ అనేది ఎంత వరకు తగినది? అంటూ కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీనిపై హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, “సినిమాలో నటీనటుల మధ్య వయస్సు గురించి కాకుండా, వారి యాక్టింగ్‌కి, పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.
మనం ఇంట్లో వయస్సు చూసి పెళ్లి నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఇది సినిమా. నటులు స్క్రీన్‌పైన ఓ పాత్రను పోషిస్తున్నారు, వారి నిజమైన వయస్సు ఆ పాత్రకి సంబంధం లేదు.
హీరో పాత్రకు అనుగుణంగా వాళ్లు నటిస్తారు, ఏజ్ ఫ్యాక్టర్ అనేది సెకండరీ,” అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా రవితేజ-శ్రీలీల జంటపై వచ్చిన విమర్శలు ధమాకా సినిమా హిట్ అయిన తరువాత ఆగిపోయాయని ఆయన గుర్తుచేశారు.
అలానే, సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి లాంటి జంటలతో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చిన సందర్భాలను ఉదహరిస్తూ, అప్పుడు వయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదని హరీష్ శంకర్ వివరించారు.