బాలయ్య కోసం హరీష్ శంకర్ మాస్ ట్రీట్ రెడీ!
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి తన స్టైల్‌లో బలమైన రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత హరీష్‌కు అదే స్థాయిలో మళ్లీ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. రీసెంట్‌గా రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ ఫెయిలవడంతో, ఈసారి సేఫ్ గేమ్ లో బాలయ్యను ఎంచుకున్నాడట.
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో బాలకృష్ణ ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నట్లు టాక్. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టుగా పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయి. బాలయ్య అభిమానులను అలరించేలా డైలాగ్స్, యాక్షన్ సీన్స్ పక్కా మాస్ టచ్‌లో ఉంటాయట.
ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. ఇది కన్నడలో భారీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్న ప్రముఖ బ్యానర్. యష్, విజయ్, కార్తిలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం హై బజ్‌లో ఉంది. ఇప్పుడు బాలయ్య సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు.
హరీష్ శంకర్ ప్రస్తుతం రామ్‌తో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తుండగా, బాలయ్య ప్రాజెక్ట్‌తో తన మాస్ మానియా మళ్లీ చూపించాలన్న టార్గెట్‌తో ఉన్నాడు. బాలయ్య – హరీష్ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఈ మాస్ మాస్ సెటప్‌కి టైటిల్, రిలీజ్ డేట్ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. కానీ ఇది ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ అవుతుందని చెప్పొచ్చు.