మూవీడెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్‌గా విడుదలైన మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నించాడు.
రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా, చివరికి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఈ పరాజయం తర్వాత, హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇదిలా ఉంటే, హరీష్ శంకర్ ఇటీవల ఒక కమర్షియల్ యాడ్‌ను కూడా తెరకెక్కించాడు, ఇందులో మెగాస్టార్ చిరంజీవి కనిపించి, ఒక మిల్క్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు.
ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో మెగా అభిమానులు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. చిరంజీవి వర్క్‌ని చూసి, అభిమానులు హరీష్‌తో ఆయన సినిమా చేస్తే అదిరిపోతుందని అభిప్రాయపడ్డారు.
కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో, చిరంజీవి-హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది.
మెగాస్టార్ చిరు, హరీష్ శంకర్ పనితనాన్ని మెచ్చుకుని ఆఫర్ ఇచ్చారని వార్తలు వినిపించాయి. అయితే, ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ వార్తలు పూర్తిగా రూమర్స్ మాత్రమేనని, న్యూ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదని సమాచారం. చిరంజీవితో వర్క్ చేయాలనే కోరికను హరీష్ శంకర్ పలుమార్లు వెల్లడించాడు.
చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయనతో ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీస్తానని హరీష్ తన మనసులోని మాటను బయట పెట్టాడు.