మూవీడెస్క్: టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్, రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో హరీష్, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే కొంత భాగం షూట్ అయినప్పటికీ, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ బ్రేక్‌లో ఉంది.
అయితే ఈ గ్యాప్‌లో హరీష్ శంకర్ కొత్త ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినట్లు సమాచారం.
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫిక్స్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
హరీష్ తన స్టైల్‌లో బాలయ్యకు మాస్ ఎలిమెంట్స్‌తో పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
మొదట ఆవేశం రీమేక్ కోసం బాలయ్యతో హరీష్ సినిమా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, దాని మీద ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇప్పుడు మాత్రం హరీష్ కొత్త కథను డిజైన్ చేసి, త్వరలో బాలయ్యకు నేరేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
నిర్మాత నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హరీష్, బాలయ్య కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.