హైదరాబాద్: కరోనా వల్ల, లాక్ డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాడుకుంటున్నారు. కొందరు ఇన్నిరోజులు చూడకుండా ఉండిపోయిన సినిమాలని, వెబ్ సిరీస్ లని చూస్తూ తమకి నచ్చిన వాటిని సజెస్ట్ చేస్తున్నారు. కొందరు కొత్త కొత్త అలవాట్లు, వంటలు నేర్చుకుంటున్నారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తమ భావాల్ని తన ఐడియాలజీ ని పోడ్ కాస్ట్స్, ముసింగ్స్ రూపంలో పెడుతున్నారు. ప్రస్తుతం అదే బాటలో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ‘సౌండ్స్ గుడ్ ‘ పేరుతో తన భావాల్ని షేర్ చేసుకోబోతున్నారు.
పూరి జగన్నాథ్ సినిమాలో ఉపయోగించే మాటలే కొన్ని సార్లు తూటాల్లాగా పేలుతాయి, అవి ఎంతో కొంత ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. ఇప్పటికే పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్స్ కి మంచి పేరొచ్చింది. చాలా బాగున్నాయని చాలా మంది సెలబ్రిటీ లు కూడా సోషల్ మీడియా లో చెప్పారు. హరీష్ శంకర్ కూడా తన పెన్ పవర్ ని తాను తీసిన సినిమాలు ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘దువ్వాడ జగన్నాధం’, ‘గద్దలకొండ గణేష్’ లాంటి సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం పలు విషయాల పైన తన భావాల్ని షేర్ చేసుకోవడానికి పోడ్ కాస్ట్స్ చేయబోతున్నాడు.