న్యూఢిల్లీ: భారత దేశ మహిళల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కరోనా వైరస్ సోకింది. తనకు జ్వరం రావడంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగ ఉందని, త్వరలోనే ఆమె కోలుకుంటారని పేర్కొన్నారు. అయితే ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ ఆడారు. ఐదు వన్డేల్లో కలిపి మొత్తంగా 160 పరుగులు కూడా చేశారు.
కానీ ఈ సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో కోల్పోయింది. ఇక ఐదో వన్డేలో గాయపడిన హర్మన్‌ప్రీత్, సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్ లో ఆడలేదు. కాగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు కూడా ఈ మధ్య కరోనా సోకిన విషయం తెలిసిందే. అదే విధంగా పఠాన్ సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ సైతం తమకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ప్రకటించారు.