స్పోర్ట్స్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున హర్షల్ పటేల్ ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా, మ్యాచుర్డ్ బౌలింగ్‌తో ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి టాప్ లిస్టులో నిలిచాడు. తాజాగా చెన్నైపై మ్యాచ్‌లో 4/28తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
అయితే హర్షల్ ప్రయాణం సునాయాసంగా సాగలేదు. 17 ఏళ్ల వయసులో అమెరికాలోని పెర్ఫ్యూమ్ షాపులో రోజుకు 35 డాలర్లకు పని చేసిన అతడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా క్రికెట్ కలను వదలకుండా తిరిగి భారత్‌కు వచ్చి బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరచుకున్నాడు.
డెత్ ఓవర్లలో హర్షల్ స్పెషాలిటీ స్లోవర్ బంతులు, పేస్ మార్పులు. లసిత్ మలింగ తరహాలో కాకుండా, తనదైన బ్రావో స్టైల్ డెలివరీలతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఏబీ డివిలియర్స్ కూడా అతని టాలెంట్‌ను ప్రశంసించాడు.
ఐపీఎల్‌లో ఒడిదుడుకులు చవిచూసినా 2021 నుంచి ఇప్పటిదాకా 102 వికెట్లు సాధించి తన స్థానం చూపించాడు. భారీ ధరకు వేలంలో అమ్ముడై తన విలువను నిరూపించాడు.
పెర్ఫ్యూమ్ షాపు నుంచి ఐపీఎల్ స్టార్‌గా ఎదిగిన హర్షల్ పటేల్ నిజమైన స్పూర్తిదాయక ప్రయాణం. పట్టుదల, కష్టపడి పని చేయడమే విజయానికి మార్గమని అతని కథ అందరికీ చెబుతోంది.