ముంబై: జూన్ నెలతో ముగిసిన త్రైమాసానికి గాను టెక్ సంస్థ అయిన హెచ్సీఎల్ 20.3% వృద్ధితో ఏకంగా రూ. 4257 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. హెచ్సీఎల్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇదే సమయానికి గత ఏడాది ర్. 3534 కోట్లు నికర లాభం నమోదు చేయగా, ఈ సారి 7 శాతం వృద్ధి నమోదైనట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ఫేస్ వాల్యూ కలిగిన ఒక్కొక్క ఈక్విటీ షేర్లపై ఏకంగా రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కూడా సంస్థ బోర్డు సభ్యులు అంగీకరించినట్లు సమాచారం.