అమరావతి: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం స్వల్ప గుండెపోటుకు గురయ్యారు.
తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే ఆయన 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మరోవైపు రాధా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
పలువురు వంగవీటి రాధ ఇంటి వద్దకు వెళ్లి వివరాలను తెలుసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.