విజయవాడ: ఏపీ లో అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వానలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో ఏపీ లో రెండు నుండి మూడు చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది.
జులై 17వ తేదీన రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. 18 మరియు 19వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల నివసిస్తున్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.