హైదరాబాద్: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలియ జేసింది. ఇరు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో వాయుగుండం ప్రభావమూ ఉందని తెలిపింది.
ఈ ప్రభావం వల్ల రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో భారీగా, ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవ వచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అలాగే ఈ నెల 17 నుంచి మరో రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లు, అపార్టుమెంట్లు నదులను తలపిస్తున్నాయి. జనజీవనం ఇంకా నిటిలోనే ఉంది, ఇప్పుడు కురవబోయే భారీ వర్షాలకు పరిస్థితి ఎంటనేది ప్రజలు భయపడుతున్నారు.