తెలుగు సినీ పరిశ్రమలో 500కు పైగా చిత్రాల్లో నటించి, తనదైన గుర్తింపు తెచ్చుకున్న హేమ, ఇప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించింది. “జీవితం అంతా కష్టమేనా? ఇక బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నా” అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆమె ప్రకటించిన ఈ వార్త ఆమె అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది.
హేమ గతంలో ఎన్నో కామెడీ, సీరియస్ క్యారెక్టర్ రోల్స్‌లో ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా, పెద్ద సినిమా, పవర్ఫుల్ రోల్ ఇచ్చినా నటించను అంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె చేసిన వ్యాఖ్యలపై అభిమానులు, సినీ వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పిందా లేక తాత్కాలిక విరామమా అనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కొన్ని వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించడం, ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా, హేమ లాంటి టాలెంటెడ్ నటీమణి ఇక తెరపై కనిపించదనుకోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం. మరి ఆమె నిర్ణయం ఫిక్సా? లేక తిరిగి రీ-ఎంట్రీ వస్తుందా? అన్నది చూడాలి.