మూవీడెస్క్: ఒరిజినల్ స్టోరీలతో మనసుల్ని దోచుకుంటున్న కొత్త తరం దర్శకుల్లో వేణు ఎల్దండి ఒకరు.
బలగం సినిమాతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, రెండో ప్రాజెక్ట్ గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి.
మొదటి సినిమాతో సంచలనం సృష్టించినా, రెండో సినిమా మొదలుకాని నేపథ్యంలో ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ముందుగా ఎల్లమ్మ కథతో నాని హీరోగా దిల్ రాజు బ్యానర్‌లో సినిమా కుదురుతుందనే వార్తలొచ్చాయి.
కానీ ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో కొందరు నితిన్‌తో వేణు సినిమా చేయనున్నారని ఊహించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో హనుమాన్ హీరో తేజ సజ్జా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తేజ సజ్జా కథకు అంగీకరించడంతో, వేణు ఎల్దండి తన కథను ఎల్లమ్మకి అనుగుణంగా డెవలప్ చేయనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్ షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వేణు కొత్త సినిమా పట్టాలెక్కనుంది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావచ్చని అంచనా.
ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉండగా, వేణు ఎల్దండితో తేజ సజ్జా కాంబినేషన్ టాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.