న్యూఢిల్లీ: మీరు బైక్ ప్రియులా, రానున్న పండుగ సందర్భంలో నూతన బైక్ ను లేదా స్కూటర్ ను కొనాలని ఆలోచిస్తున్నారా, అలాంటి వారికి చేదు వార్త అందించింది హీరో మోటోకార్ప్. దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీ ఈ పెంచిన ధరలను దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేది నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. మార్కెట్లో ప్రతి రోజూ పెరుగిపోతున్న విడిభాగాల వస్తువుల ధరల వల్లనే తమ ద్విచక్ర వాహన ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చిన్నట్లు ఒక ప్రకటనలో హీరో మోటోకార్ప్ తెలిపింది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు అనేది రూ.3,000 వరకు ఉండనుంది. బైక్, స్కూటర్ వేరియంట్ బట్టి ధరలు పెరగనున్నాయని తెలిపింది.