హైదరాబాద్: కోవిడ్-19 వ్యాధి చికిత్స కోసం పరిశోధనాత్మక యాంటీవైరల్ మెడిసిన్ రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి మార్కెట్ చేయడానికి రెగ్యులేటర్ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం పొందిందని హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటెరో ఆదివారం తెలిపింది.
అమెరికాకు చెందిన గిలియడ్ సైన్స్ యొక్క ప్రయోగాత్మక కోవీడ్-19 చికిత్స రెమ్‌డెసివిర్ యొక్క జెనరిక్ వెర్షన్ భారతదేశంలో కోవిఫర్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కోవిఫర్ 100 మిల్లీగ్రాములు (ఇంజెక్షన్) అందుబాటులో ఉంటుంది, వీటిని హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో హాస్పిటల్ నేపధ్యంలో ఇంట్రావీనస్‌గా నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ వ్యాక్సిన్ తక్కువ మరియు మధ్య ఆదాయలు ఉన్న దేశాలలోని ప్రజలాకు అందుబాటు ధరలో లభించేలా గిలియాడ్ సైన్సెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
“భారతదేశంలో కోవీడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కోవిఫోర్ (రెమ్‌డెసివిర్) యొక్క ఆమోదం సానుకూలాంశం అవుతుందన్నారు. బలమైన సామర్థ్యం కలదని, ఉత్పత్తి వెంటనే తయారవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా రోగులకు అందుబాటులో వస్తుంది అని హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి పార్థసారధి రెడ్డి అన్నారు.
దేశానికి కావలసిన వ్యాక్సిన్ డిమాండ్ ఆధారంగా ఉత్పత్తి చేసే విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.