హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా ఆయనను అరెస్టు చేయడంపై ప్రశ్నలు సంధించింది.
ఉగ్రవాదిలా అరెస్టు ఎందుకు?
మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని (పీపీ) నిలదీసింది. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా అని ప్రశ్నిస్తూ, ఆయన అరెస్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగినట్లు తెలిపింది.
గాయాల నివేదికలపై సందేహాలు
పోలీసు దాడిలో గాయపడ్డ అధికారుల పరిస్థితిపై సమగ్ర నివేదిక అందించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మొదట తీవ్ర గాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి, ఆ తరువాత వాటిని స్వల్పగాయాలుగా చూపడం ఏంటని ప్రశ్నించింది.
పిటిషన్‌పై వాదనలు ముగింపు
రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని నరేందర్‌రెడ్డి పిటిషన్ వాదనలపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. నరేందర్‌రెడ్డి వ్యవహారంపై వాంగ్మూలాలను అందజేయాలని పీపీని ఆదేశించింది. మరోవైపు నరేందర్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని పీపీ కోర్టుకు తెలియజేసారు.
హైకోర్టు అభ్యంతరం
రిమాండ్ ఆర్డర్‌ను రద్దు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పీపీపీ వాదనలు వినిపించారు. కానీ, సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అరెస్టు కాకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.